⚜️ దారిద్ర్యం అంటే ఏమిటి? ⚜️

🌿🌿🌿🥀🥀🥀🍂🍂🍂

❗ దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడంకాదు. ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్నదానితో తృప్తిలేకుండ ఉండడమే దరిద్రం. పైకి ధనం లేనట్టు కనబడ్డా ధర్మిష్టి అయ్యి వేద ధర్మాన్ని ఆచరించి నిత్యతృప్తుడని కొనియాడబడిన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్నవాడు దరిద్రుడు కాదు కానే కాదు పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.

❗ అన్నీ ఉన్నా ధర్మదూరులై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, కుల దేవతను, స్వధర్మాన్ని, వదిలి ప్రవర్తించి, అనాచారాన్ని ప్రవర్తింపచేసిన రావణాది రాక్షసులు, కంసకౌరవాదుల వలె పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా వారే అసలైన దరిద్రం అనుభవించినవారు.

Advertisement

❗ భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, కులదేవతారాధనం, స్వధర్మపాలనం, ఆచారసంప్రదాయాలను పాటించడం, గురుపాద సేవనం ఇవే ఐశ్వర్యం — తద్వ్యతిరిక్తమే దారిద్ర్యం.


🙏 స్వస్తి

సమస్త లోకాః సుఖినో భవంతు 🙏